ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
TG: కరీంనగర్ జిల్లా బొమ్మకల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.