'దళారులను నమ్మి మోసపోవద్దు'

TPT: శ్రీవారి దర్శనం, వసతి కోసం భక్తులు దళారులను ఆశ్రయించవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సూచించింది. దర్శనం, వసతి కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా కౌంటర్ల వద్ద టోకెన్లు తీసుకుని నమోదు చేసుకోవాలని టీటీడీ తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులను హెచ్చరించింది.