ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
SRD : రామచంద్రాపురంలో రంజాన్ పవిత్ర మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజి ఫేజ్-1లో ఉన్న మసీదే మహమ్మదీయాలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 13న నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు తెలిపారు.