'దివ్యాంగులకు పారదర్శకంగా ఐడీల జారీ'
WNP: దివ్యాంగులకు UDID కార్డులను పారదర్శకంగా జారీ చేయాలని వనపర్తి అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం అర్హులైన వారికే సర్టిఫికెట్లు అందాలని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.