VIDEO: బుడమేరు వంతెనను ఢీకొన్న లారీ

కృష్ణా: చెన్నై కోల్కతా హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గన్నవరం(M) కేసరపల్లి సమీపంలోని బుడమేరు వంతెన వద్ద ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వంతెనను ఢీకొని రోడ్డు మధ్యలో ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో లారీని పక్కకు తీస్తున్నారు.