'ఐదు రోజుల్లోనే గ్యాస్ డెలివరీ'
VZM: జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన తర్వాత ఐదు రోజుల్లోగా డెలివరీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, మూడు గ్యాస్ కంపెనీలు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన వెల్లడించారు.