న్యూ ఇండియా లిటరసీని విజయవంతంగా అమలు చేయాలి

NRML: జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలాల వారిగా నిరక్షరాస్యుల వివరాలను సేకరించి వారికి కనీస విద్యను నేర్పించాలని సూచించారు.