రేపు ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులేదు
ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతథంగా కొనసాగనున్నట్లు డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను కారణంగా పాఠశాల ప్రాంగణాలు దెబ్బతినలేదని స్పష్టత తీసుకున్న తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించాలని డీఈవో సూచించారు.