అటకెక్కిన ఈ-పర్మిట్

సూర్యాపేట: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ-పర్మిట్ విధానం అటకెక్కింది. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో ఈ-విధానం అమలు చేయాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినా నేటికీ అమలు జరగడం లేదు. ఈ విధానంతో జీరో కొనుగోళ్లను అరికట్టడంతో పాటు.. మద్దతు ధర పొందే వీలుంది. ఇప్పటికైనా అధికారులు ఈ విధానాన్ని అమలు చేయాలని పలువురు అన్నదాతలు కోరుతున్నారు.