నేడు మంత్రి పర్యటన వివరాలు

కృష్ణా: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం నూజివీడులో పర్యటించనున్నారు. ఈ మేరకు నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారని నూజివీడు ఎండీఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి.