బాలికల వసతి గృహాలకు సొంతభవనాలు నిర్వహించాలి

MHBD: బాలికల కళాశాల వసతి గృహాలకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం గర్ల్స్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్ పనితీరు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ సబ్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.