'అయ్యప్ప పడిపూజను విజయవంతం చేయండి'
BHNG: సంస్థాన్ నారాయణపురంలో డిసెంబర్ 7న ఉదయం 10 గంటలకు నిర్వహించే అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమ కరపత్రాలను శ్రీ శంకరానంద స్వామి, అయ్యప్ప సన్నిధి స్వాములతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక చౌరస్తాలో రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ మహా పడిపూజను భక్తులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.