నేడు తాళ్లూరు మండలంలో పవర్ కట్

నేడు తాళ్లూరు మండలంలో పవర్ కట్

ప్రకాశం: తాళ్లూరు మండలంలోని దోసకాయలపాడు, లక్కవరం, నాగంబోట్లపాలెం గ్రామాల్లో గురువారం మధ్యహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు. దోసకాయలపాడు సబ్‌స్టేషన్లో VBC ఫిక్సింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.