VIDEO: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
SRPT: తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునుంచే భక్తులు మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయ ఆవరణలో ఉన్న పుట్ట వద్ద పాలు, గుడ్లు, నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగదేవత విగ్రహాలకు అలంకరించి పూజలు చేశారు.