జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మీనాహజుద్దీన్

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మీనాహజుద్దీన్

MBNR: జడ్చర్లకు చెందిన సీనియర్ నేత సయ్యద్ మీనాహజుద్దీన్ ను పాలమూరు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ నియామకం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నేతలు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, జిల్లా అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తారని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.