అడవి పంది దాడి.. యువకుడికి గాయాలు

అడవి పంది దాడి.. యువకుడికి గాయాలు

ADB: అడవి పంది దాడి చేయడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఉట్నూర్‌లో చోటుచేసుకుంది. హస్నాపూర్‌‌కి చెందిన ప్రవీణ్ బుధవారం తన ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తుండగా అతడిపై ఓ అడవి పంది అకస్మాత్తుగా దాడి చేసింది. ప్రవీణ్ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి అక్కడి నుంచి పందిని తరిమికొట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.