VIDEO: నాగులపాడు సచివాలయానికి బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు
BPT: అద్దంకి మండలం నాగులపాడు గ్రామ సచివాలయానికి బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు లభించినట్లు ఎంపీడీవో వరూధిని తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల ప్రచారం ముగింపు కార్యక్రమంలో బుధవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్ సచివాలయం సానిటరీ కార్యదర్శిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.