నల్ల బ్యాడ్జీలుతో తెలిపిన ఉపాధ్యాయులు

SKLM: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిలారులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు, జీఓ నెంబర్ 57 అమలు, పెండింగ్ డిఏలు, 12వ పీఆర్సీ, ఈహెచ్ఎస్ పరిమితి పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల నాయకులు హెచ్ఎల్ నాయుడు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.