మావోయిస్టులకు ఉపరాష్ట్రపతి కీలక అభ్యర్థన
అభివృద్ధికి అవరోధంగా ఉన్న నక్సలిజానికి చరమగీతం పాడటం గర్వకారణమని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవంలో ప్రసంగిస్తూ.. రాష్ట్రప్రభుత్వం, భద్రతాబలగాల ఆపరేషన్స్‌తో నక్సలిజం అంతరించిపోయే దశకు చేరిందని, ఇకనైనా మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోవాలని కోరారు. శాంతి లేకుండా ఎలాంటి అభివృద్ధి సాధించలేమని వారిని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు.