ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సామేలు

SRPT:- ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మద్దిరాలలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.