అస్తవ్యస్తంగా రోడ్లు.. ప్రజలకు ఇబ్బందులు
VSP: నగరంలోని రద్దీగా ఉండే డాబా గార్డెన్స్ ప్రాంతంలో రోడ్ల దుస్థితి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో పాటు, అనేక చోట్ల లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.