పిల్లల నిర్బంధం ఘటనపై నటి సంచలన పోస్ట్‌

పిల్లల నిర్బంధం ఘటనపై నటి సంచలన పోస్ట్‌

ముంబైలోని ఓ యాక్టింగ్ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను నిర్బంధించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మరాఠీ నటి రుచితా విజయ్ జాదవ్ సంచలన విషయాలు వెల్లడించారు. పిల్లలను బంధించడానికి రెండ్రోజుల ముందు తాను కూడా ఆ కిడ్నాపర్‌ను కలవాల్సి ఉందన్నారు. అతడి బారిన పడకుండా తాను త్రుటిలో తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ రోజు ఏదో శక్తి తనను కాపాడినట్లు అనిపిస్తోందని తెలిపారు.