తిరుమలలో మహిళ మిస్సింగ్.. కేసు నమోదు
TPT: తిరుమలలో ఓ మహిళ మిస్సింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా సంగడి గుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ(27) శ్రీ వారి దర్శానికి కుటుంబ సభ్యులతో వచ్చింది. HVC 694-A గది నుంచి తెల్లవారు జామున 3గంటలకు బయటకు వెళ్లింది. ఇటీవలే పెద్దలు కుదుర్చిన వివాహం ఇష్టం లేక వెళ్లినట్లుగా అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.