ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు రూ.25 కోట్లు..!
RR: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన నిర్మాణానికి రూ.25 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి, ప్రజలకు కమిషనరేట్ కార్యాలయం అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతోంది. మల్కాజ్‌గిరి కమిషనరేట్ భవన నిర్మాణం వలే ఆలస్యం చేయొద్దని కోరుతున్నారు.