VIDEO: భగీరథ పైప్‌లైన్ లీక్.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

MHBD: పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి స్టేజీ సమీపంలోని ప్రధాన రహదారిపై బ్రిడ్జి పై భగీరథ పైప్‌లైన్ ఆదివారం ఉదయం పగిలి నీరు వృథాగా పోతోంది. లీకైన నీరు రహదారిపై పడటంతో తిరుమలగిరి, హైదరాబాద్ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు చేయాలని వాహనదారులు కోరారు.