స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

జగిత్యాల: విశ్వకర్మ జయంతి సందర్భంగా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సంఘసభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవలో భాగంగా ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సందర్భంగా స్వర్ణకార సంఘం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక మంచి సంప్రదాయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు.