'ఎర్రుపాలెం మండలంలో 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం'
KMM: ఎర్రుపాలెం మండలంలోని మొత్తం 31 గ్రామపంచాయితీల్లో ఆరు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలో అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మిగిలిన అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, జమలాపురం, కాచవరం, గట్ల గౌరారం, చొప్పకట్లపాలెం, కండ్రిక, రామన్నపాలెం గ్రామపంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి.