'జిల్లాకు త్వరలో యూరియా.. ఆందోళన వద్దు'

'జిల్లాకు త్వరలో యూరియా.. ఆందోళన వద్దు'

MDK: రైతులు ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియాను సరిపడా అందజేస్తామని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. గురువారం వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాకి సరిపడినంత యూరియా రానున్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైనంత మేరకు ఎరువులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.