నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి: CPI

నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి: CPI

NDL: మిడుతూరు మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకుడు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మిడుతూరు మండల కేంద్రంలో తడిచిన మొక్కజొన్న ధాన్యాన్ని వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు కలిసి పరిశీలించారు. అధిక వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.