గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్ అభిమానులు
NDL: డోన్‌లో అల్లు అర్జున్ అభిమానుల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా హాజరయ్యారు. రక్తదానం ప్రాణదాతతో సమానమని, చిన్నారుల ప్రాణాలను రక్షించేందుకు యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.