రెండు గేట్లు ఏర్పాటు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్

NZB: ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో వద్ద నూతనంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ వద్ద రెండు గేట్లు నిర్మించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్ డిపో నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కళాశాలలకు వెళ్లే వారికి చుట్టుపక్కల కాలనీ వాసులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ అవేజ్ వున్నారు.