గ్యాస్ కొరతపై మంత్రి క్లారిటీ
GNTR: గ్యాస్ కొరతపై వదంతులు నమ్మొద్దని తెనాలి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య అవసరాలకు 70% అదనపు గ్యాస్ కోటా కల్పించిందని చెప్పారు. రాష్ట్రంలో 17 రోజులకు సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయని స్పష్టం చేశారు. అధిక బుకింగ్‌ల వల్లే తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయని, త్వరలో సరఫరా సాధారణ స్థాయికి వస్తుందని తెలిపారు.