VIDEO: నా ఎదుగుదల ఓర్వలేకపోతున్నారు: మేయర్
KDP: తాను సాధారణ కార్యకర్తగా ఎదిగిన తీరును కొందరు ఓర్వలేకపోతున్నారని మేయర్ పాక సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడానని, వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. నా ఎదుగుదలను గిట్టనివారు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్త స్థాయి నుంచి మేయర్‌గా ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.