VIDEO: 'పొగాకు రహిత సమాజానికి కృషి చేయాలి'
ADB: పొగాకు రహిత యువతకై ప్రచారం 3.0లో భాగంగా గురువారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరాఠీ మీడియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అవగాహన ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పొగాకు రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. జిల్లా విద్యా శాఖ సెక్టరియల్ అధికారి సుజాత్ఖాన్, సోషల్ వర్కర్ చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.