'జిల్లాలో యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం'

MBNR: జిల్లా వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంఛార్జ్ అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.