రోడ్డుపై నిలుస్తున్న వర్షపు నీరు.. BRS నేత నిరసన

యాదాద్రి: భూదాన్ పోచంపల్లి పట్టణం 13వ వార్డులో వర్షపు నీరు నిల్వ ఉండడంతో BRS యూత్ నాయకుడు చింతకింది కిరణ్ మంగళవారం వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై వర్షం నీరు కుంటలా తలపిస్తుందని విమర్శించారు. గత రెండేండ్ల నుంచి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.