రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు

NRML: దస్తురాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. తన బైక్ పై వస్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే స్పందించి, అక్కడికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.