స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్యసాయి: రోళ్ల మండలం కొత్తపాళ్యం గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, TSRTC ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. స్వామికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.