VIDEO: ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

VIDEO: ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

MNCL: రామకృష్ణాపూర్ పట్టణంలో పదో తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 14న ప్రారంభమైన ఈ పరీక్షలు నేటితో పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలోని 2 కేంద్రాల్లో మొత్తం 268 మంది విద్యార్థులు ఉండగా, 100% హాజరు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.