ALERT: చీరాల బీచ్‌లో కార్తీక స్నానాలు చేయొద్దు
AP: బాపట్ల జిల్లాలోని చీరాల బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో బీచ్ వద్ద భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు బీచ్‌ను మూసివేశారు. చీరాలలోని వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. కార్తీక స్నానాలకు ప్రజలు ఎవరూ బీచ్ వద్దకు రావొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.