జగ్గయ్యపేటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ఎన్టీఆర్: జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి శివారు ప్రాంతంలో సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహం గుర్తింపు, మరణ కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.