VIDEO: వైభవంగా యాదాద్రి స్వామి వారి కళ్యాణోత్సవం

BNR: యాదగిరి కొండపై ప్రధానాలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీ నృసింహుల నిత్య కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను దివ్యమనోహరంగా అలంకరించారు. యాగశాలలో సుదర్శన నరసింహ యాగం జరిపిన అర్చకులు గజవాహనంపై అంతర్ ప్రాకార మండపంలోని కల్యాణ మండపంపై అధిష్టింప చేసి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో నిత్య కల్యాణం నిర్వహించారు.