గేల్‌, కేఎల్‌ సరసన ప్రభ్‌సిమ్రన్ సింగ్

గేల్‌, కేఎల్‌ సరసన ప్రభ్‌సిమ్రన్ సింగ్

ధర్మశాల వేదికగా LSGతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91) విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ తరఫున ఒకే సీజన్‌లో ఓపెనర్‌గా వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు గేల్ (2018), కేఎల్ రాహల్ (2018, 19, 20) ఈ ఘనత సాధించారు.