సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది

సమయపాలన పాటించని సచివాలయ సిబ్బంది

ప్రకాశం: కొమరోలు మండలంలోని నల్లగుంట్ల గ్రామ సచివాలయంలో సిబ్బంది బుధవారం ఉదయం 10:30 గంటలు అయినప్పటికీ సచివాలయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్దారులకు నేటి నుండి పింఛన్ అందిస్తారని తెలియటంతో గ్రామ సచివాలయానికి ప్రజలు చేరుకుంటున్నారు. కాగా సచివాలయ సిబ్బంది మాత్రం సమయానికి చేరుకోకపోవడంతో ప్రజలు నిట్టూరుస్తున్నారు.