'సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి'

'సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి'

SRPT: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నూతనకల్ మండలం చిల్పకుంట్లలో తెలంగాణ రైతు సంఘం గ్రామ మహాసభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కపాస్ కిసాన్ యాప్ అమలు వెనుక తీసుకోవాలన్నారు. పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం సుంకాన్ని కొనసాగించాలన్నారు.