VIDEO: నిజాంపేటలో తప్పిన ప్రమాదం
MDK: నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో సోమవారం ఓ పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రాంగ్ రూట్‌లో వస్తున్న బైక్‌ను తప్పించబోయి, లారీ డ్రైవర్ వాహనాన్ని డివైడర్ కల్వర్టుపైకి ఎక్కించాడు. బైక్‌పై ఉన్న దంపతులు కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.