VIDEO: గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత

VIDEO: గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత

TG: హైదరాబాద్ షేక్‌పేట్ కూడలి వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ల కోసం బుక్ చేసినా రావడం లేదని ఆగ్రహించిన కొందరు వ్యక్తులు, లోడ్‌తో బయటకు వస్తున్న ఆటో నుంచి బలవంతంగా సిలిండర్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడి సిబ్బంది, స్థానికులు వారిని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న సిలిండర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.