వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడిగా జగదీశ్వరరావు
VZM: వైసీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బొండపల్లి మండల శాఖ అధ్యక్షుడిగా బోడసింగిపేట గ్రామానికి చెందిన బోడసింగి జగదీశ్వరరావును మరోసారి వైసీపీ కేంద్ర కార్యాలయం నియమించింది. జగదీశ్వరరావు నియామకం పట్ల బొండపల్లి మండలానికి చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని ఆయన హమీ ఇచ్చారు.