VIDEO: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
PLD: చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తి నాణ్యత, తూకం తదితర అంశాలను పరిశీలించారు.