ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు
ELR: వేసవి దృష్ట్యా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూపాకర్ తెలిపారు. ఈ నెల 18న చర్లపల్లి-నరసాపురం(07233), 19న నరసాపురం-చర్లపల్లి(07234), 20న నరసాపురం-తిరుపతి(07132) రైళ్లు నడపనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.